లారీని ఢీకొన్న కారు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:22 AM
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం గుణపురెడ్డిపాలెం సమీపంలో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొని విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన పసుపులేటు రఘువీర్ (58) మృతిచెందాడు.
విశాఖవాసి మృతి
పూసపాటిరేగ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం గుణపురెడ్డిపాలెం సమీపంలో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొని విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన పసుపులేటు రఘువీర్ (58) మృతిచెందాడు. బుధవారం రాత్రి ప్రమాదం జరగ్గా భోగా పురం సీహెచ్‌సీలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖకు చెందిన పసుపులేటు రఘువీర్ పని మీద విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లారు. బుధవారం సాయంత్రం చీపురుపల్లి నుంచి కారులో బయలుదేరిన రఘువీర్ గుణపురెడ్డిపాలెం వద్దకు వచ్చేస రికి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలు కాగా అతన్ని పోలీసులు భోగాపురం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన గురువారం మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.