కృష్ణసాగర్ జలాశయానికి గండి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:51 PM
): సీతంపేట ఏజెన్సీలోని చిన్నబగ్గ ప్రాంతంలో ఉన్న నళిని కృష్ణసాగర్ జలాశయం చానల్‌కు ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడింది.
సీతంపేట రూరల్, సెప్టెంబరు 7(ఆంధ్ర జ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని చిన్నబగ్గ ప్రాంతంలో ఉన్న నళిని కృష్ణసాగర్ జలాశయం చానల్‌కు ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడింది. జలాశయం నుంచి హెడ్‌చానల్ ద్వారా వస్తున్న నీరు గండి పడిన చోటు నుంచి గెడ్డలో కలిసిపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గండిపడిన ప్రదేశాన్ని మట్టి, ఇసుక బస్తాలతో రైతులు తాత్కాలికంగా పూడ్చారు. అయితే రెండు రోజులుగా మన్యంలో కురుస్తున్న వర్షాలకు నీరు ఉప్పొంగి ప్రవహించడంతో మళ్లీ గతంలో గండిపడిన చోటే కొట్టేసింది. దీంతో గిరిజన రైతులు ఆదివారం జోరువానలో శ్రమదానం నిర్వహించారు. గండిని మళ్లీ పూడ్చారు. గండిని పూడ్చిన అనంతరం నీరును తమ పొలాలకు మళ్లించారు. అధికారులు స్పందించి శాశ్వతంగా గండిని పూడ్చే పనులు చేపట్టాలని గిరిజన రైతులు కోరారు.