Share News

బైకు అదుపు తప్పి.. తుప్పల్లోకి దూసుకువెళ్లి

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:19 AM

మండలంలో కూనాయవలస గ్రామానికి చెందిన గిడిజాల చందు(24) ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో తుప్పల్లోకి దూసుకువెళ్లి మృతి చెందాడని ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు.

బైకు అదుపు తప్పి.. తుప్పల్లోకి దూసుకువెళ్లి

తెర్లాం, జూలై 26(ఆంధ్రజ్యోతి): మండలంలో కూనాయవలస గ్రామానికి చెందిన గిడిజాల చందు(24) ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో తుప్పల్లోకి దూసుకువెళ్లి మృతి చెందాడని ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు. అయితే చందు మృతిచెందినట్లు ఆలస్యంగా గుర్తించారు. ఎస్‌ఐ కథనం మేరకు.. అమిటి గ్రామంలోని బంధువుల ఇంటికి చందు ఈనెల 22న తన వెళ్లాడు. అదేరోజు తిరుగు ప్రయాణంలో తెర్లాం జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న మలుపులో వర్షం కురుస్తున్న సమయంలో ద్విచక్రవాహనం అదుపు తప్పింది. దీంతో పక్కన ఉన్న తుప్పల్లోకి చందు దూసుకువెళ్లాడు. అందులో ఉన్న ఒక చెట్టుకు బైకు ఢీకొన డంతో ద్విచక్ర వాహనం ఆయనపై పడి మృతిచెందాడు. చందు తుప్పల్లో ఉండడంతో ఎవరూ గుర్తించలేదు. వాసన రావడంలో కొంత మంది శనివారం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చందుకు భార్య స్వాతి ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. చందు వండ్రంగి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.

Updated Date - Jul 27 , 2025 | 12:19 AM