Share News

kurasingi మంచం పట్టిన కురసింగి

ABN , Publish Date - May 02 , 2025 | 11:43 PM

The Bedridden kurasingi సీతంటపేట మండలం కురసింగి గిరిజన గ్రామం మలేరియాతో వణుకుతోంది. పదుల సంఖ్యలో గ్రామస్థులు మంచం పట్టారు. మలేరియా జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  kurasingi  మంచం పట్టిన కురసింగి
కురసింగి గ్రామం

వణుకుతున్న గిరిజనులు

సీతంపేట రూరల్‌, మే 2(ఆంధ్రజ్యోతి): సీతంటపేట మండలం కురసింగి గిరిజన గ్రామం మలేరియాతో వణుకుతోంది. పదుల సంఖ్యలో గ్రామస్థులు మంచం పట్టారు. మలేరియా జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బి.సన్యాసిరావు, బి.సరోజిని, పత్తిక సిమ్మయ్య, బిడ్డిక ఎండయ్య, ఎన్‌.సాగర్‌, ఎన్‌.సింహాచలం తదితరులు మలేరియాతో బాధపడుతున్నారు. ఆ గ్రామానికి చెందిన ఎన్‌.శృతి సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి చేరింది. తాజాగా సిమ్మయ్య సీతంపేట ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నాడు. అకాల వర్షాలు, గ్రామంలో పారిశుధ్య లోపమే మలేరియా వ్యాప్తికి కారణాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో వైద్య శిబిరం నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా శుక్రవారం గ్రామంలో మలేరియా సిబ్బంది మలాథిన్‌ స్ర్పెయింగ్‌ చేశారు.

పెరుగుతున్న కేసులు

ఏజెన్సీలో అపడమిక్‌ సీజన్‌ ప్రారంభం కాక ముందే మలేరియా విజృంభిస్తోంది. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో గతేడాది డిసెంబరులో 42, ఈ ఏడాది జనవరిలో 50, ఫిబ్రవరిలో 24, మార్చిలో 61 , ఏప్రిల్‌ నెలలో 110 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదు నెలల కాలంలో 287 కేసులు నమోదయ్యాయంటే సీతంపేట మన్యంలో మలేరియా తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పక్కాగా స్ర్పేయింగ్‌: డీఎంహెచ్‌వో

పార్వతీపురం రూరల్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని, పక్కాగా ఐఆర్‌ఎస్‌ నిర్వహించాలని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం జిల్లేడువలసలో ఐఆర్‌ఎస్‌ స్ర్పేయింగ్‌ను పరిశీలించారు. ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లోనూ స్ర్పేయింగ్‌ చేయాలని సూచించారు. డ్రైడే, ఫీవర్‌ సర్వే కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 915 గ్రామాల్లో ఐఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహించ నున్నామని తెలిపారు. అనంతరం గోచెక్క గ్రామీణ ఆరోగ్య కేంద్రం, డోకిశీల పీహెచ్‌సీని సందర్శించారు. ఓపీ నమోదు, మందుల రికార్డులు పరిశీలించారు. ఓఆర్‌ఎస్‌, మందుల నిల్వల లభ్యతపై అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో జిల్లా మలేరియా అధికారి వై.మణి, పీహెచ్‌సీ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:43 PM