Share News

స్థానిక సంస్థల్లో కూటమిదే విజయం: ఎంపీ

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:34 PM

రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఆదివారం విజయనగరం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నిరంగా ల్లో రాష్ట్రం ముందుకువెళ్తోందని తెలిపారు.

స్థానిక సంస్థల్లో కూటమిదే విజయం: ఎంపీ
మాట్లాడుతున్న కలిశెట్టి అప్పలనాయుడు :

విజయనగరం రూరల్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యో తి): రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఆదివారం విజయనగరం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నిరంగా ల్లో రాష్ట్రం ముందుకువెళ్తోందని తెలిపారు. దేశం లోని విమానరంగంల సమస్యలపై కేంద్రప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోందని,దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలిపారు. విజయనగ రంలో ఘన చరిత్రగల మహారాజా ప్రభుత్వ సం గీత, నృత్య కళాశాల అభివృద్ధికి రూ 150 కోట్ల రూ పాయలు కేంద్ర ప్రభుత్వం విడుదలచేసేందుకు సిద్ధంగా ఉందని,దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని చె ప్పారు.సమావేశంలో టీడీపీ నాయకులు గంటా రవి, పీతల కోదండరామ్‌, గాడు అప్పారావు, ముద్డాడ చంద్రశేఖర్‌, కోండ్రు శ్రీనివాస రావు, వారణాసి మల్లిబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:34 PM