సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం: విప్
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:07 AM
: ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్ కార్యాలయం ప్రజాదర్బార్ నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్ కార్యాలయం ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, నాయకులు డొంకాడ రామకృష్ణ, కోలా రంజిత్‌కుమార్, మరడా తవిటినాయుడు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల టీడీపీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్, కేవీ కొండయ్య, చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేన ని విప్ జగదీశ్వరి తెలిపారు. గుమ్మలక్ష్మీపురంలో మండల విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ఉపాధ్యాయులదినోత్సవం పురస్కరించుకుని మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించారు.కార్యక్రమంలో ఎంఈవోలు చంద్రశేఖర్, భీముడు, సర్పంచ్ చైతన్య స్రవంతి, భద్రగిరి ఏపీఆర్ ప్రిన్సిపాల్ యుగంధర్, హరిప్రసాద్,కృష్ణమూర్తి, టీడీపీ మండలాధ్యక్షుడు అడ్డాకుల నరేష్ పాల్గొన్నారు.