Share News

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:54 PM

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ ముందుకు సాగుతున్నారని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం: ఎమ్మెల్యే
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ :

రాజాం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ ముందుకు సాగుతున్నారని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. మంగళవారం రాజాంలోని శ్రీకాకుళంరోడ్డులోగల బ్యాంకు ఆఫ్‌ ఇండియా వెనుక ఏర్పాటుచేసిన బాక్స్‌ క్రికెట్‌ను ప్రారంభించారు. అనంతరం, గృహనిర్మాణ, విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్షిం చారు. కొత్తవలసలో సిమ్మెంట్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి సకాలంలో బిల్లులు అం దించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్‌ సమస్య ఏర్పడితే తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు శాసపు రమేష్‌కుమార్‌, పొట్నూరు లక్ష్మణరావు, మరిపి జగన్మోహనరావు, పిల్లా సత్యంనాయుడు, నల్ల శ్రీనివాసరావు, కొంపిల్లి రవీంద్ర, కోటి, ఏడీఈ రెడ్డి తిరుపతిరావు, ఏఈ కుమార్‌,డీఈఈ రత్నకర్‌, ఏఈలు రాజమోహ న్‌రావు, దుర్గారావు పాల్గొన్నారు, అలాగే శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో ఎని మిది మందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

Updated Date - Nov 25 , 2025 | 11:54 PM