Share News

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం: ఎస్పీ

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:04 AM

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని ఎస్పీ దామోదర్‌ అన్నారు. పోలీ సు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నగరంలోని మూడులాంతర్ల జంక్షన్‌ నుంచి కోట జంక్షన్‌ వరకూ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని శుక్రవారం రాత్రి నిర్వహించారు.

 శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం: ఎస్పీ
విజయనగరం క్రైం:కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్పీ తదితరులు :

విజయనగరం క్రైం, అక్టోబరు 31 (ఆంధ్ర జ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని ఎస్పీ దామోదర్‌ అన్నారు. పోలీ సు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నగరంలోని మూడులాంతర్ల జంక్షన్‌ నుంచి కోట జంక్షన్‌ వరకూ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై, ర్యాలీని ప్రారంభించా రు. కోట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన అమర వీరుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మ రణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఓపెన్‌ హౌస్‌ ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. కార్యక్ర మంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ గోవిందరావు, కోటి రెడ్డి, సీఐలు ఏవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సూరినాయుడు, నర్సింహమూర్తి, ఆర్‌ఐలు రమేష్‌కుమార్‌, శ్రీనివాసరావు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: సీఐ

రాజాం రూరల్‌, అక్టోబరు 31 (ఆంరఽధజ్యోతి): దేశం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పొలీస్‌ అమరవీరులను నిత్యం స్మరించాల్సిన బాధ్యత పొలీస్‌ లపై ఉందని రాజాంటౌన్‌ సీఐ కె.అశోక్‌ కుమార్‌ తెలిపారు. అమరవీరుల ప్రాణ త్యాగం ద్వారా సమాజానికి బంగారు బాటలువేశారని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాజాం అంబేడ్కర్‌ జంక్షన్‌లో ఏక్తా దివస్‌, పొలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్స వాలు పురస్కరించుకుని సీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమర వీరుల ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రవికిరణ్‌, ఏఎస్‌ఐలు వెంకటరమణ, సుగుణాకరరావు, రెడ్‌క్రాస్‌ రాజాం శాఖ అధ్యక్షుడు సాయి ప్రశాంత్‌ కుమార్‌, పెంకి చైతన్యకుమార్‌, గర్లంకి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఫ చీపురుపల్టి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):యువత రక్తదానికి ముందుకు రావాలని సీఐ జి. శంకరరావు కోరారు. చీపురుపల్లిలో పోలీస్‌ అమరవీరుల సంస్మ రణ దినం పురస్కరించుకుని పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్య క్రమంలో ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:04 AM