Share News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:15 AM

కొత్తవలస మండలం జోడుమెరక గ్రామానికి చెందిన జోడు అప్పన్నకు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

 పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

విజయనగరం క్రైం/ కొత్తవలస, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొత్తవలస పోలీసు స్టేషన్‌లో 2025 మే నెలలో నమోదైన పోక్సో కేసులో నింది తుడు కొత్తవలస మండలం జోడుమెరక గ్రామానికి చెందిన జోడు అప్పన్నకు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస మండలం జోడుమెరక గ్రామానికి చెందిన జోడు అప్పన్న అలియాస్‌ అఖి.. ఓ బాలికకు చాక్‌లైట్‌ ఇచ్చి పాడుబడిన ఇంట్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసు స్టేషన్‌లో సీఐ షణ్ముఖరావు మే 22, 2025న పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు త రలించారు. న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేయ గా, నేరారోపణలు రుజువు కాగా, న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించి నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన డీఎస్పీ శ్రీనివాసరావు, విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ గోవిందరావు, సీఐ షణ్ముఖరావు, హెచ్‌సీ రామకృష్ణ, కోర్టు కానిస్టేబుల్‌ ఎర్రినాయుడు, స్పెషల్‌ పీపీ ఖాజానారావు లను ఎస్పీ దామోదర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Dec 24 , 2025 | 12:15 AM