Share News

That house... three generations of masters ఆ ఇంట.. మూడు తరాల మాస్టార్లు

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:12 AM

That house... three generations of masters ఆ ఇంట మూడు తరాలుగా ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. తాత ఒకప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేయడం, తండ్రి కూడా అదే వృత్తిని స్వీకరించడం, తాజాగా మనవడు కూడా మెగా డీఎస్సీలో ఎంపిక కావడం అరుదైన విషయంగా ముచ్చర్లవలస గ్రామస్థులు భావిస్తున్నారు.

That house... three generations of masters ఆ ఇంట.. మూడు తరాల మాస్టార్లు
రామకృష్ణ, శ్రీరామ్మూర్తి, రత్నాకర్‌

ఆ ఇంట.. మూడు తరాల మాస్టార్లు

తాత, తండ్రి.. ఇప్పుడు మనవడు ఎంపిక

అభినందించిన ముచ్చర్లవలస గ్రామస్థులు

రామభద్రపురం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఆ ఇంట మూడు తరాలుగా ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. తాత ఒకప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేయడం, తండ్రి కూడా అదే వృత్తిని స్వీకరించడం, తాజాగా మనవడు కూడా మెగా డీఎస్సీలో ఎంపిక కావడం అరుదైన విషయంగా ముచ్చర్లవలస గ్రామస్థులు భావిస్తున్నారు.

రామభద్రపురం మండలం ముచ్చర్లవలస గ్రామానికి చెందిన సాసుబిల్లి రామకృష్ణ దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1922వ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆయన పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశాక ఉద్యోగ విరమణ పొంది 2016లో పరమపదించారు. ఆయన ముగ్గురు కుమారులు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. వీరిలో ఇద్దరు ఉద్యోగ విరమణ పొందారు. మొదటి కుమారుడు సాసుబిల్లి సుందరశ్రీరామ్మూర్తి ఆరికతోట జడ్పీ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసిన సమయంలో ఉద్యోగ విరమణ పొందారు. రెండో కుమారుడు సాసుబిల్లి రామానుజలనాయుడు పూసపాటిరేగ మండలం కొప్పెర్ల రెసిడెన్సియల్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడో కుమారుడు సాసుబిల్లి తిరుపతిరావు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్నాడు. కాగా సాసుబిల్లి రామకృష్ణ మనవడు, సాసుబిల్లి సుందర శ్రీరామ్మూర్తి రెండో కుమారుడైన సాసుబిల్లి రత్నాకర్‌ ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపికై బాడంగి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా విధుల్లో చేరాడు. ఒకే వంశంలో మూడు తరాలవారు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంపై సర్పంచ్‌ కనిమెరక శంకరరావు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

--------------

Updated Date - Oct 15 , 2025 | 12:12 AM