Share News

Tethered drone for the district జిల్లాకు టెథర్డ్‌డ్రోన్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:20 AM

Tethered drone for the district అత్యధిక సమయం గాలిలో ఎగురుతూ ఖచ్చితమైన సమాచారం అందజేసే టెథర్డ్‌డ్రోన్‌ జిల్లాకు వచ్చేసింది. ప్రభుత్వం జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా దీనిని కేటాయించింది. సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘా పెంచేందుకు టెథర్డ్‌డ్రోన్‌ వినియోగిస్తామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Tethered drone for the district జిల్లాకు టెథర్డ్‌డ్రోన్‌
టెథర్డ్‌ డ్రోన్‌ని పరిశీలిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

జిల్లాకు టెథర్డ్‌డ్రోన్‌

ప్రత్యేక నిఘా కోసం జిల్లా పోలీసులకు కేటాయించిన ప్రభుత్వం

విజయనగరం క్రైం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): అత్యధిక సమయం గాలిలో ఎగురుతూ ఖచ్చితమైన సమాచారం అందజేసే టెథర్డ్‌డ్రోన్‌ జిల్లాకు వచ్చేసింది. ప్రభుత్వం జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా దీనిని కేటాయించింది. సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘా పెంచేందుకు టెథర్డ్‌డ్రోన్‌ వినియోగిస్తామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. పనితీరును స్వయంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ డ్రోన్‌ సుమారు 10 గంటల పాటు గాల్లో తేలుతూ, ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిఘా పెడుతుందన్నారు. ఎలక్ట్రీకల్‌ పవర్‌ లేదా జనరేటర్‌ సాయంతో ఒక కేబుల్‌ ఆధారంగా డ్రోన్‌ పనిచేస్తుందని, ఏదైనా ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగే విపత్తుల్లో సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ టవర్‌ గాను, ఇంటర్నెట్‌ సేవలు అందించే ఫ్లోటింగ్‌ టవర్‌గాను పనిచేస్తుందన్నారు. అదనంగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం నైట్‌ విజన్‌ కెమెరా కూడా కలిగి ఉందన్నారు. డ్రోన్‌ను పరిశీలించిన వారిలో సీఐలు ఆర్‌వీఆర్‌ కె.చౌదరి, లీలారావు, డ్రోన్‌ పైలట్లు నరేష్‌, వెంకటేష్‌ ఉన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:20 AM