Share News

10 నుంచి టెట్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:21 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. జిల్లాలో ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

10 నుంచి టెట్‌

- జిల్లాలో ఐదు కేంద్రాల్లో నిర్వహణ

- హాజరుకానున్న 13,985 మంది అభ్యర్థులు

విజయనగరం కలెక్టరేట్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. జిల్లాలో ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. సీతం ఇంజనీరింగ్‌ కాలేజీ, ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌, ఎంవీజీఆర్‌, లెండి, అవంతి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈనెల 10 నుంచి 21 వరకు ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌తో పాటు ఒరిజినల్‌ గుర్తింపు కార్డు (ఆధార్‌, పాన్‌, ఓటర్‌) తప్పకుండా తీసుకుని వెళ్లాలి. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. వీహెచ్‌, పీహెచ్‌ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా సమయం ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలను అనుమతించరు. ప్రతి కేంద్రానికీ ఒక డిప్యూటీ తహసీల్దార్‌, డిపార్టుమెంట్‌ అధికారి ఉంటారు. విద్యా శాఖ నుంచి ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు కానుంది. గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన టెట్‌ పరీక్షను 22,889 మంది అభ్యర్థుల రాశారు.

Updated Date - Dec 06 , 2025 | 12:21 AM