Terrified… బిక్కుబిక్కుమని..
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:42 PM
Terrified… trembling with fear! పాలకొండలో ఇందిరానగర్ కాలనీలో ఉన్న సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఆయా కార్యాల యాలకు వచ్చేవారు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి
పలు శాఖలకు నిలువ నీడ కరువు
భయాందోళనలో ఉద్యోగులు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
పాలకొండ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పాలకొండలో ఇందిరానగర్ కాలనీలో ఉన్న సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఆయా కార్యాల యాలకు వచ్చేవారు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వాస్తవంగా 2011-12లో పాలకొండ ఆర్డీవోగా పనిచేసిన సాలూరు వెంకటేశ్వరరావు ఇందిరానగర్ కాలనీలో బీసీ బాలుర వసతిగృహ సముదాయానికి మరమ్మతులు చేపట్టి సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనంగా మార్చారు. సుమారు 15గా పైగా ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఉండేలా చొరవ చూపారు. దీంతో ప్రభుత్వానికి కొంతమేర అద్దె ఖర్చులు తగ్గినట్టు అయింది. కార్యాలయాలు ఉండడంతో వివిధ పనులు మీద వచ్చే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేది. అయితే ఆ భవనాలన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోగా.. విష సర్పాల బెడద కూడా వెంటాడుతోంది.
ఇదీ పరిస్థితి...
సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనంలో డివిజనల్ పంచాయతీరాజ్, మత్స్య, కార్మిక శాఖలు, సబ్ డివిజన్ అంగన్‌వాడీ కేంద్రం, హౌసింగ్ డీఈ, ఏఈ, డీపీఆర్‌వో, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయాలు, గ్రామ కచేరీ, సచివాలయం, ఆధార్ సేవా కేంద్రం తదితర కార్యాల యాలు ఉండేవి. అయితే భవన సముదాయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో డీఎల్‌పీవో సిబ్బంది , డీఎల్‌డీవో కార్యాలయంలోని ఒక రూమ్‌లో తలదాచుకుంటున్నారు. హౌసింగ్ డీఈ కార్యాలయం, కార్మికశాఖ ప్రైవేట్ భవనాల్లోకి మారాయి. గ్రామ కచేరీ, డీపీఆర్‌వో కార్యాలయాలు మూతపడ్డాయి. బీసీ, ఎస్పీ వెల్ఫేర్ కార్యాలయాలు వేరోచోటకు తరలి వెళ్లాయి. మత్స్యశాఖకు భవనం కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం సమీకృత భవనంలో సచివాలయం, మత్స్యశాఖ, ఆధార్ సేవా కేంద్రాలే ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులు కూడా నగర పంచాయతీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వారికి భవనం సమకూరకపోవడంతో అక్కడే కాలం వెల్లదీస్తు న్నారు. సచివాలయానికి సంబధించి శ్లాబు పై పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుం దోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆధార్ సేవా కేంద్రంలో కంప్యూటర్ ధ్వంసమైంది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ఉద్యోగులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం..
‘మత్స్యశాఖ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆ భవనంలోకి విధులు నిర్వహిం చాలంటే భయమేస్తోంది. నూతన భవనం మంజూరు చేయాలని ప్రజాప్రతినిఽధులు, ఉన్నతాధికా రులకు నివేదించాం. ’ అని మత్స్య శాఖ ఉద్యోగి ఎస్.శోభన్‌బాబు తెలిపారు.