Share News

Tensions Continue జూలైలోనూ కలవరమే..

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:58 PM

Tensions Continue in July Too జిల్లాలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజుల కిందట ఎండలు ఠారెత్తించాయి. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు, రైతులు ఊపిరిపీల్చుకున్నారు.

Tensions Continue   జూలైలోనూ కలవరమే..

  • ముఖం చాటేసిన వరుణుడు

  • మళ్లీ పెరిగిన ఎండ వేడి

  • అడపాడదపా వర్షాలు కురుస్తున్నా.. వేధిస్తున్న ఉక్కపోత

  • ఆందోళనలో ప్రజలు, రైతులు

పార్వతీపురం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజుల కిందట ఎండలు ఠారెత్తించాయి. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు, రైతులు ఊపిరిపీల్చుకున్నారు. వాతావరణం చల్లబడగా.. మరోవైపు పంట పొలాల్లోకి నీరు చేరింది. సాగునీటి వనరులు, ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో ఎంతో ఆనందంతో రైతులు ఖరీఫ్‌ పనులు ప్రారంభించారు. కాగా రెండు రోజుల నుంచి మళ్లీ వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమై ఉన్నా.. వేడి, దానికి తోడు ఉక్కపోత అధికంగా ఉండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే సమయంలో సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు ప్రబలుతుండడంతో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్‌ రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా వాతావరణ మార్పులు మన్యం వాసులను కలవరపరుస్తున్నాయి.

Updated Date - Jul 29 , 2025 | 11:58 PM