Share News

tension at Kasturba School కస్తూర్బా పాఠశాలలో కలకలం

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:24 AM

tension at Kasturba School గుర్ల కస్తూర్బా బాలికల విద్యాలయంలో మంగళవారం సాయంత్రం కలకలం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌షర్క్యూట్‌ జరిగి వ్యాపించిన మంటలను ఆపేందుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారు. వివరాల్లోకి వెళితే..

tension at Kasturba School కస్తూర్బా పాఠశాలలో కలకలం
విద్యార్థులను పరామర్శిస్తున్న అధికారులు

కస్తూర్బా పాఠశాలలో కలకలం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఆందోళన చెందిన బాలికలు

ఐదుగురు విద్యార్థినులకు గాయాలు

గుర్ల/ నెల్లిమర్ల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): గుర్ల కస్తూర్బా బాలికల విద్యాలయంలో మంగళవారం సాయంత్రం కలకలం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌షర్క్యూట్‌ జరిగి వ్యాపించిన మంటలను ఆపేందుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారు. వివరాల్లోకి వెళితే..

గుర్ల కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్‌ సెకండియర్‌ తరగతి గదిలో మంగళవారం సాయంత్రం విద్యుదాఘాతం జరిగి ఫ్యాను తగలబడి ంది. అదే సమయంలో అగ్గి పుట్టి పక్కనే ఉన్న డార్మిటరీ, పిల్లల దుస్తులకు వ్యాపించింది. దుస్తులు తగలబడటాన్ని గమనించిన ఐదుగురు విద్యార్థినులు మంటలను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో వారిపైకి అగ్గినిప్పులు తుళ్లి గాయపడ్డారు. వై.శ్రావణి, జె.సుజాత, ఈ.వెంకటలక్ష్మి, జి.కృపాసంధ్య, కె.దీక్షితకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యాలయంలో కేకలు, అరుపులు మిన్నంటాయి. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు 108 ద్వారా నెల్లిమర్ల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వర్షాలకు గోడలు బాగా తడవడంతో విద్యుదాఘాతం జరిగి ఉంటుందని పాఠశాల ఎస్‌వో జానకి అభిప్రాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థినుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఘటన గురించి తెలుసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెల్లిమర్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను టీడీపీ నాయకులు కిమిడి రామమల్లిక్‌నాయుడు, వి.సన్యాసినాయుడు, వి.శివప్రసాద్‌, కె.సూర్యనారాయణ పరామర్శించారు.

Updated Date - Oct 29 , 2025 | 12:24 AM