temples ready ముస్తాబైన ఆలయాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:18 AM
temples ready వైకుంఠ ఏకాదశి పూజలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. వివిధ రకాల పూలతో ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం గుండా దర్శనాలకు దేవదాయశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు.
ముస్తాబైన ఆలయాలు
తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం
నేడు వైకుంఠ ఏకాదశి
విజయనగరం కల్చరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పూజలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. వివిధ రకాల పూలతో ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం గుండా దర్శనాలకు దేవదాయశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు వైష్ణవ దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయి. కొన్ని ఆలయాల్లో రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని నియమించినట్టు దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష తెలిపారు. విజయనగరంలోని శివాలయం వీధి వేంకటేశ్వర స్వామి ఆలయం, సంతపేట జగన్నాథస్వామి ఆలయం, మండపంవీధిలో వున్న మన్నార్ రాజగోపాలస్వామి ఆలయాలతో పాటు రామతీర్థం, గొర్లె సీతారామపురం తదితర ప్రాంతాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.