Telugu Must Be Preserved తెలుగును పరిరక్షించుకోవాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:18 PM
Telugu Must Be Preserved తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.
పార్వతీపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. సామాన్యుల వాడుక భాషలో గ్రంథ రచన జరగాలని ఉద్యమించిన మహనీయుడు రామమూర్తి అని కొనియాడారు. ఈ ప్రాంతానికి చెందిన గిడుగు జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. గిరిజన సవర భాషకు ఆయన లిపిని కూడా అందించారని, భాష పేరుతో మన్యంలో దేవాలయం ఉండడం గొప్ప విషయమని వెల్లడించారు. తెలుగు వికాసానికి పాటుపడిన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి వంటి వారి చరిత్రలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. విద్యార్థుల కోసం వచ్చే నెల 5న తెలుగు మాసప త్రికను విడుదల చేయనున్నామని, అందులో వారిు అవసరమైన సమాచారంతో పాటు రచనలు ఉంటాయని తెలిపారు. తొలుత తెలుగు భాష విశిష్టతపై రచయితలు జి.గౌరునాయుడు , చింతా అప్పలనాయుడు , మల్లిపూడి జగదీశ్వరరావు కవితలను వినిపించగా, జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్ గీతాన్ని ఆలపించారు. అనంతరం కవులు, రచయితలను కలెక్టర్ సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు, డీఎంహెచ్‌వో ఎస్.భాస్కకరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రాధాన్య అంశాలపై అవగాహన తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్య అంశాలపై పూర్తిగా అవగాహన ఉండాలని కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారులకు సూచించారు. అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ పాత్ర కీలకమన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని పత్రాలను జారీ చేయాలన్నారు. సమయపాలన పాటిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కార్యదర్శులకు అవగాహన కల్పించాలని , కలెక్టరేట్ నుంచి అందిన వాటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, దీనిపై జాగ్రత్త వహించాలని తెలిపారు. ప్రతి కార్యాలయానికి చెందిన జీవోలు, సర్క్యూలర్లు, ఉత్తర్వులు తదితర పత్రాలను ఈపీటీఎస్‌లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, సబ్ కలెక్టర్లు వైశాలి, స్వప్నిల్ జగన్నాథ్ , ఎస్‌డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.