టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా తేజోవతి!
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:10 AM
టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజూరు తేజోవతి నియమితులైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్వతీపురం/పాడేరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజూరు తేజోవతి నియమితులైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పీఠం కోసం చాలామంది ప్రయత్నించారు. కానీ, అధిష్ఠానం తేజోవతి వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఆమె పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తేజోవతి ప్రస్తుతం గిరిజన సలహా మండలి సభ్యురాలుగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సాలూరు లేదా పాలకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. దీనికోసం తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలేసి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో సీటు లభించకపోవడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె కృషి చేశారు.