Share News

పత్తి రైతు కంట క‘న్నీరు’

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:06 AM

మండలంలో కొద్దిరోజులుగా కురుస్తు న్న ఎడతెరిపిలేని వర్షాల పుణ్యమాని పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో గల పొలాల్లో వర్షం నీరు నిల్వ ఉండిపోవడంతో మొక్కలు కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణప్పవలస, గొర్లెసీతారాంపురం, మెట్టవలస తదితర గ్రామాల్లో ఇప్పటికే పత్తికాయలు కుళ్లిపోయి నల్లగా మారడంతో రైతులు దిగులు చెందుతున్నారు.

 పత్తి రైతు కంట క‘న్నీరు’
నారాయణప్పవలసలో తడిసిపోయిన పత్తిని రోడ్డుపై ఆరబోసిన దృశ్యం:

బొబ్బిలి రూరల్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో కొద్దిరోజులుగా కురుస్తు న్న ఎడతెరిపిలేని వర్షాల పుణ్యమాని పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో గల పొలాల్లో వర్షం నీరు నిల్వ ఉండిపోవడంతో మొక్కలు కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణప్పవలస, గొర్లెసీతారాంపురం, మెట్టవలస తదితర గ్రామాల్లో ఇప్పటికే పత్తికాయలు కుళ్లిపోయి నల్లగా మారడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంట చేతికందే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు రైతులు పండిన పత్తిని గ్రామాల్లో రోడ్లపై ఆరబెడుతున్నారు. వేలాది రూపాయలు మదుపులు పెట్టి సాగుచేసిన పంట కళ్ల ముందే పాడవుతుండంతో లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్ల పంటకు తెగుళ్లు కూడా ఆశించడంతో నాణ్యత తగ్గిపోతోంది. ఎకరాకు 2 నుంచి 2.5 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా అంతకంటే తక్కువ దిగుబడి వస్తోందని వాపోతున్నారు. గిట్టుబాటు ధర కూడా క్వింటాకు రూ.7000 పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ తమని ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి పత్తిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:06 AM