Teachers' Transfers Begin టీచర్ల బదిలీలు ప్రారంభం
ABN , Publish Date - May 28 , 2025 | 11:38 PM
Teachers' Transfers Begin ఉపాధ్యాయుల బదిలీల పర్వం బుధవారం ఆరంభమైంది. తొలుత ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంల బదిలీలతో ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మిగులు టీచర్లు 1628 మంది, తప్పనిసరి బదిలీలు 1540 మంది ఉపాధ్యాయులతో కలుపుకుని మొత్తంగా 3,168 మంది కచ్చితంగా బడి మారాల్సి ఉంది.
సాలూరు రూరల్, మే 28(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల పర్వం బుధవారం ఆరంభమైంది. తొలుత ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంల బదిలీలతో ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మిగులు టీచర్లు 1628 మంది, తప్పనిసరి బదిలీలు 1540 మంది ఉపాధ్యాయులతో కలుపుకుని మొత్తంగా 3,168 మంది కచ్చితంగా బడి మారాల్సి ఉంది. వచ్చే నెలలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రస్తుత పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వంద మంది ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు స్థానచలనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 26 మందికి తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది.ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు125 మంది, నాన్ లాగ్వేంజ్ స్కూల్ అసిస్టెంట్లు 1361 మంది, లాగ్వేంజ్ స్కూల్ అసిస్టెంట్లు 753 మంది, పీఈటీలు 27 మంది, ఎస్జీటీలు 2500 మందిబదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లు 890 మంది, లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లు 401 మంది, పీఈటీలు 14 మంది, ఎస్జీటీలు 1728 మంది తప్పనిసరిగా స్థానచలనం పొందాల్సి ఉంది.కాగాప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఎస్జీటీలకు కౌన్సిలింగ్‌పై స్పష్టత రావాల్సి ఉంది.
హెచ్‌ఎం పదోన్నతులు నేటికి వాయిదా
స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఉన్నత పాఠశాల హెచ్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ గురువారానికి వాయిదా వేశారు. ఉమ్మడి జిల్లాలో 47 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పదోన్నతులు నిర్వహించడానికి బుధవారం విజయనగరం దాసన్నపేటలోని బాలికోన్నత పాఠశాలలో ప్రక్రియచేపట్టారు. సీనియార్టీ జాబితాలో ఉన్న వారిని పిలిచారు.వారంతారాత్రి ఎనిమిది గంటల వరకు వేచి చూశారు. కాగా సాంకేతిక కారణాల వల్ల వారి పదోన్నతుల ప్రక్రియను గురువారానికి వాయిదా వేశారు.