Share News

New Locations బదిలీ స్థానాలకు గురువులు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:12 AM

Teachers Transferred to New Locations బదిలీలు పొందిన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరారు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్లు కలిసి 3,690 మందికి స్థానచలనమైన విషయం తెలిసిందే. వారిలో 2,176 మంది తాము కోరుకున్న పాఠశాలల్లో ఈ నెల 12 నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

 New Locations బదిలీ స్థానాలకు గురువులు
పాచిపెంట మండలం కందిరివలస నుంచి పాంచాళికి బదిలీపై వెళ్తున్న టీచర్‌కు వీడ్కోలు చెబుతున్న విద్యార్థులు

సాలూరు రూరల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి ): బదిలీలు పొందిన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరారు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్లు కలిసి 3,690 మందికి స్థానచలనమైన విషయం తెలిసిందే. వారిలో 2,176 మంది తాము కోరుకున్న పాఠశాలల్లో ఈ నెల 12 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. 1514 మంది టీచర్లు సోమవారం కొత్తస్థానాల్లోని పాఠశాలల్లో చేరారు. తొలుత ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి రిలీవింగ్‌ ఆర్డర్లు ఇచ్చి జాయినింగ్‌ ఆర్డర్లు పొందారు. ఉధ్యాయులకు తమ పాత పాఠశాలల్లో విద్యార్థులు, మిగతా సిబ్బంది వీడ్కోలు పలికారు. కొత్త పాఠశాలల్లో అక్కడి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

Updated Date - Jun 17 , 2025 | 12:12 AM