Students’ Health Care విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత టీచర్లదే..
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:08 AM
Teachers Responsible for Students’ Health Care వసతిగృహ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత టీచర్లదేనని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వార్డెన్లు, హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనారోగ్య కారణాలతో వసతిగృహ విద్యార్థులు బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఆరోగ్యవంతులుగా హాస్టల్‌కు వచ్చే వరకు సంబంధిత ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
పార్వతీపురం, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): వసతిగృహ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత టీచర్లదేనని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వార్డెన్లు, హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనారోగ్య కారణాలతో వసతిగృహ విద్యార్థులు బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఆరోగ్యవంతులుగా హాస్టల్‌కు వచ్చే వరకు సంబంధిత ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. పిల్లల ఆరోగ్య వివరాలను ముందుగా తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య రికార్డులను నిర్వహించాలన్నారు. వారికి పౌష్టికాహారం అందించాలని, వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, సహాయ గిరిజన సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి
పార్వతీపురం రూరల్: పరిసరాల పరిశుభ్రత విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని జేసీ ఆదేశించారు. డోకిశీలలోని గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.