సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులు
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:50 PM
సమాజానికి నిజమైన దిక్సూచి, మార్గదర్శ కులు ఉపాధ్యాయులేనని వారిని సముచితంగా గౌరవించుకోవడం మనందరి కర్తవ్యమని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.
బొబ్బిలి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సమాజానికి నిజమైన దిక్సూచి, మార్గదర్శ కులు ఉపాధ్యాయులేనని వారిని సముచితంగా గౌరవించుకోవడం మనందరి కర్తవ్యమని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. ఆదివారం బొబ్బిలి కోటలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో 12 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ విద్యతోవికాసం సిద్ధిస్తుందని,అది ఉపాధ్యా యుల ద్వారానే అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రగ్రంథాలయ పరిషత్ డైరెక్టరు రౌతు రామ్మూర్తి, రిటైర్డ్ ఎంఈవో కృష్ణమూర్తి, రామారావు పాల్గొన్నారు.