Share News

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:57 PM

పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటు తో మృతిచెందిన ఘటన సాలూరు మండలం పాలికవలసలో గురువారం చోటుచేసుకుంది.

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
బాలకృష్ణ (ఫైల్‌)

సాలూరు రూరల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటు తో మృతిచెందిన ఘటనసాలూరు మండలం పాలికవలసలో గురువారం చోటుచేసుకుంది. సాలూరు మండలం పాలిక వలసకు చెందిన కోట బాలకృష్ణ(54) అదే మండలంలోని బర్ణికవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తన భార్య లక్ష్మితో కలిసి వాకింగ్‌కు వెళ్లి వచ్చారు. అనంతరం ఆయన పాఠశాలకు సిద్ధమయ్యారు. టిఫిన్‌ చేయడానికి ప్లేటు తీసుకుంటున్న సమయం లో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినప్పటికే ఆయన మృతి చెందారు. ఆయన మృతిపై డీఈవో రాజకుమార్‌, సీఐటీయూ జిల్లా నేత ఎన్‌వై నాయుడు, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి భార్య లక్ష్మి సాలూరు బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:57 PM