Share News

టీడీపీకి కార్యకర్తలే బలం

ABN , Publish Date - May 19 , 2025 | 12:24 AM

కార్య కర్తలే తెలుగుదేశం పార్టీ బలమని పార్వతీపురం ఎమ్మె ల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

టీడీపీకి కార్యకర్తలే బలం
విజయ సంకేతం చూపిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

  • ఎమ్మెల్యే విజయచంద్ర

  • పార్వతీపురంలో మినీ మహానాడు

పార్వతీపురం/బెలగాం, మే 18 (ఆంధ్రజ్యోతి): కార్య కర్తలే తెలుగుదేశం పార్టీ బలమని పార్వతీపురం ఎమ్మె ల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురంలోని రాయల్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కార్యకర్తలే టీడీపీకి బలం అని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్‌ వంటివి ప్రవే శపెట్టిన మొట్టమొదటి పార్టీ టీడీపీ అని గుర్తు చేశా రు. గత 30 ఏళ్ల నుంచి ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని, కార్యకర్తలు ఏ క్షణంలోనైనా తనను కలిసి సమస్యలు తెలపవచ్చన్నారు. పార్వతీపురానికి మహాప్రీ తి కంపెనీ తీసుకొచ్చేందకు ప్రయత్నిస్తున్నా మని తెలిపారు. ముందుగా పలువురు కళాకారులు నాటికలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే వారిని సన్మానించి, నగదు బహుమతి ని అందజేశారు.

ఇదీ అభివృద్ధి..

ఈసందర్భంగా టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే వివరించారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకంలో పార్వతీపురం నియోజకవర్గానికి రూ.70 కోట్లు నిధులు తీసుకొచ్చి, సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించామని చెప్పారు. చినఅంకలాం నుంచి బూర్జి వరకు రూ.9 కోట్ల నిధులతో సాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీలో తాగునీరు అందించేందుకు రూ.80 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. జంఘావతి నుంచి మున్సిపాలిటీకి తాగునీరుకు ప్రతిపాదించామని, జంఘావతికి రూ.51 కోట్లు నిధులు మంజూరు చేశా మని ఆయన వివరించారు. జిల్లా కేంద్రంలో అధునా తన ఆసుపత్రి నిర్మాణానికి రూ.52 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. పట్టణంలో పులిగుమ్మి నుంచి లేదా హెచ్‌.కారాడ వలస నుంచి శివిని వరకు బైపాస్‌ నిర్మాణానికి రూ.700 కోట్లతో ప్రణాళికలు పంపించా మన్నారు. ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు పైడిరాజు, పార్టీ నాయకులు జి.వెంకటనాయుడు, గుంట్రెడ్డి రవికుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు బోను చంటి, రౌతు వేణు, పెంకి వేణు, టీడీపీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:24 AM