TDP టీడీపీ అరకు పార్లమెంట్ కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:13 AM
TDP Forms Araku Parliamentary Committee టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ ఎంపిక కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అధ్యక్షురాలుగా ఎం.తేజోవతి, ప్రధాన కార్యదర్శిగా డి.లక్ష్మణరావును నియమించారు. బుధవారం ఉపాధ్యక్షులుగా జిల్లాకు చెందిన బూరాడ రామ్మోహన్‌రావు, జి.అన్నవరం, డి.రామారావు నాయుడు, కె.రవీంద్రపాత్రుడును నియమించారు. మొత్తంగా తొమ్మిది మంది ఉపాధ్యక్షుల్లో జిల్లాకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది
పార్వతీపురం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ ఎంపిక కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అధ్యక్షురాలుగా ఎం.తేజోవతి, ప్రధాన కార్యదర్శిగా డి.లక్ష్మణరావును నియమించారు. బుధవారం ఉపాధ్యక్షులుగా జిల్లాకు చెందిన బూరాడ రామ్మోహన్‌రావు, జి.అన్నవరం, డి.రామారావు నాయుడు, కె.రవీంద్రపాత్రుడును నియమించారు. మొత్తంగా తొమ్మిది మంది ఉపాధ్యక్షుల్లో జిల్లాకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది. ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జిల్లాకు చెందిన జె.తేరోజమ్మ, బి.మధుసూదనరావు, పి.ఈశ్వరరావు, బి.నాగేశ్వరరావు, కె.జానయ్య నియమితులయ్యారు. పార్లమెంట్ అధికార ప్రతినిధులుగా రెడ్డి శ్రీనివాసరావు, జి.ముసలినాయుడు, జి.సంతోష్‌కుమార్, అప్పలకొండ, కార్యదర్శులుగా జి.రవికుమార్, బి.రామన్నదొర, టి.రామారావు, ఎన్.నీలకంఠేశ్వరరావు, జయలక్ష్మి, ట్రెజరీగా మధ్య అప్పారావు, ఆఫీస్ కార్యదర్శిగా అక్కేన రాధ, ఈశ్వరమ్మ నియామకమయ్యారు.