టారిఫ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:09 AM
ఒప్పందాలను ధిక్కరించి అమెరికా నుంచి దిగుమతి అయ్యే సరుకులపై భారీగా ట్రంప్ విధించిన టారిఫ్‌లు రద్దుచేయాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కోరారు.
బెలగాం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఒప్పందాలను ధిక్కరించి అమెరికా నుంచి దిగుమతి అయ్యే సరుకులపై భారీగా ట్రంప్ విధించిన టారిఫ్‌లు రద్దుచేయాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కోరారు. పన్నులు పెంచడం మోడీ అసమర్ధతకు నిదర్శమని వామపక్ష విమర్శించారు. శనివారం పార్వతీపురం ఆర్టీసీ కూడలిలో అమెరికా సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు కృష్ణమూర్తి, కుమార్, సంగం తదితరులు పాల్గొన్నారు.