Share News

Stree Nidhi Loans రూ.86 కోట్ల స్త్రీనిధి రుణాలు లక్ష్యం

ABN , Publish Date - Jul 08 , 2025 | 10:53 PM

Target of ₹86 Crore Stree Nidhi Loans జిల్లాలో పొదుపు సంఘాలకు రూ.86 కోట్ల వరకు స్ర్తీనిధి రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏజీఎం కామరాజు తెలిపారు. ఇప్పటివరకు రూ.12.4 కోట్లు అందజేశామన్నారు.

 Stree Nidhi Loans  రూ.86 కోట్ల స్త్రీనిధి రుణాలు లక్ష్యం
బలిజిపేటలో మాట్లాడుతున్న స్త్రీనిధి ఏజీఎం కామరాజు

బలిజిపేట, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పొదుపు సంఘాలకు రూ.86 కోట్ల వరకు స్ర్తీనిధి రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏజీఎం కామరాజు తెలిపారు. ఇప్పటివరకు రూ.12.4 కోట్లు అందజేశామన్నారు. మంగళవారం బలిజిపేట వెలుగు కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా బలపడాలన్న లక్ష్యంతో రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రుణాలను తిరిగి సకాలంలో చెల్లించే విధంగా సహకరించాలని కోరారు. జిల్లాలో రూ.50 లక్షల మేర బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. వాటి వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. స్త్రీనిధి రుణాలు చెల్లించేందుకు ముందుకురాని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయన వెంట మేనేజర్‌ ప్రసన్నకుమార్‌, వెలుగు ఏపీఎం రామకృష్ణ, సీసీలు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 10:53 PM