Share News

Tanguturi.. టంగుటూరి.. నేటి తరానికి ఆదర్శం

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:23 AM

Tanguturi.. A Role Model for Today’s Generation టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు నేటి తరానికి ఆదర్శమని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో టంగుటూరి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

Tanguturi..  టంగుటూరి..  నేటి తరానికి ఆదర్శం
టంగుటూరి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న జేసీ శోభిక

పార్వతీపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు నేటి తరానికి ఆదర్శమని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో టంగుటూరి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి.. ప్రగతికి బాటలు వేశారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయంలోని పలు విభాగాల పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వ్యాధుల నివారణపై అవగాహన

వర్షాకాలంలో వ్యాధుల నివారణా చర్యలపై అవగాహన పెంచుకోవాలని జేసీ సూచించారు. కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో శనివారం ‘ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గృహంతో పాటు పరిసరాల్లో ఎటువంటి చెత్తలేకుండా చూడాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతమైన ప్రజలను చైతన్యవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:23 AM