Share News

Talent can excellent ప్రతిభతో ఉన్నతంగా రాణించవచ్చు

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:19 AM

Talent can excellent పోలీసు శాఖలో మంచి ప్రతిభ కనబరిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, సాధించినది కానిస్టేబుల్‌ ఉద్యోగమేనన్న నిరాశ వద్దని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు.

Talent can excellent ప్రతిభతో ఉన్నతంగా రాణించవచ్చు
శిక్షణకు వెళ్తున్న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేస్తున్న ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

ప్రతిభతో ఉన్నతంగా రాణించవచ్చు

వృత్తి నైపుణ్యం సాధించాలి

ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

విజయనగరం క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మంచి ప్రతిభ కనబరిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, సాధించినది కానిస్టేబుల్‌ ఉద్యోగమేనన్న నిరాశ వద్దని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. జిల్లాలో పోలీసుశాఖకు ఎంపికైన 116 మంది కానిస్టేబుళ్లు తొమ్మిదినెలల శిక్షణకు వెళ్లే ముందు శనివారం ఎస్పీ దామోదర్‌ను కలిశారు. వారికి శిక్షణలో అనుసరించాల్సిన తీరుపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణతో కానిస్టేబుల్‌ బాధ్యతలు నిర్వహిస్తే ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ, ఎస్పీ స్థాయి కూడా ఎదగవచ్చునన్నారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, కంప్యూటర్‌ శిక్షణలో మెలకువలను అలవర్చుకుని సైబర్‌ నేరాలను చేధించడం, నియంత్రించడం తెలుసుకోవాలని చెప్పారు. తొమ్మిది మాసాల శిక్షణ పూర్తయ్యే నాటికి ప్రతి ఒక్కరూ మెరికల్లా తయారు కావాలన్నారు. సమాజానికి పట్టిన జబ్బుని వదిలించే ఒక డాక్టరులాగా పోలీసులు పనిచేయాల్సి వుందన్నారు. తప్పుచేసిన వ్యక్తులను శిక్షించడంతో పాటు వారిని సంస్కరించి సన్మామార్గంలో నడిపించాల్సిన బాధ్యత పోలీస్‌దని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ సౌమ్యలత, డీపీవో ఏవో శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ లీలారావు, సీసీఎస్‌ సీఐ కాంతారావు, ఆర్‌ఐ గోపాలనాయుడు, టి శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఐ నీలిమ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:19 AM