ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:25 AM
ఏను గులను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణపురం గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే విజయచంద్రకు కోరారు. శుక్రవారం సాయంత్రం ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ఏనుగులు తమ ప్రాంతం నుంచి తరలించే విధంగా చూడాలన్నారు. అ
పార్వతీపురం రూరల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఏను గులను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణపురం గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే విజయచంద్రకు కోరారు. శుక్రవారం సాయంత్రం ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ఏనుగులు తమ ప్రాంతం నుంచి తరలించే విధంగా చూడాలన్నారు. అదే విధంగా లక్ష్మీనారాయణపురం, చొక్కాపువా నివలస మధ్య ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలకు అనేక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నాయని, ప్రజలతో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, త్వరలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీనిచ్చారు.