Share News

బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:07 AM

గతంలో ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులకు సంబం ధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశించారు.

బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళా వెంకటరావు

  • ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గతంలో ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులకు సంబం ధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశించారు. 2014-2019 సంవత్సరాల మధ్య నిర్వహిం చిన ఉపాధి పనులపై ఆయన నాలుగు మండలాల అధికారులతో శనివారం చీపురుపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో జరిగిన పనులకు గత ప్రభుత్వం బిల్లు చెల్లింపులు నిలి పివేసిందని ఆయన తెలిపారు. ఈసందర్భంగా నాలుగు మండలాల అధికారులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద సుమారు 500 పనులు జరిగాయని, ఈ పనులకు సంబంధించి రూ.91లక్షలు చెల్లించాల్సి ఉంద ని ఎమ్యెల్యేకు వివరించారు. ఈ చెల్లింపులు సత్వరమే జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీవో ఐ.సురేష్‌, ఏపీవో ఆదిబాబు, నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఏపీవోలు, పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచం ద్రుడు, ముల్లు రమణ, తాడ్డి సన్యాసినాయుడు, పైల బలరాం, సారేపాక సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:07 AM