Share News

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:54 PM

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.బుధవారం చిలకపాలెంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

 ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
వినతిని స్వీకరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు:

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.బుధవారం చిలకపాలెంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ్మినాయుడుపేట నుంచి సింహద్వారం వరకు సర్వీసు రోడ్డుపై భారీ వాహ నాలు రాకపోకల వల్ల ప్రమాదం పొంచి ఉందని టీడీపీ నేత వావిపపల్లి రామకృష్ణ, జేజేఎం పనులు పూర్తిచేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని మాజీ సర్పంచ్‌ చిలక రాము, నారాయణపురం ఆధునీకరణ, గ్రోయన్స్‌ నిర్మాణం చేపట్టాలని పొన్నాడ టీడీపీ నేతలు పంచిరెడ్డి సత్యనారాయణ, పంచిరెడ్డి కృష్ణారావు ఎంపీకి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారధులతో మాట్లాడారు. కార్యక్రమంలో నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌, లంక శ్యామ్‌, కుమరాపు రవికుమార్‌, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు గొర్లె లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:55 PM