కమిషనర్‌పై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:39 AM
కమిషనర్‌పై చర్యలు తీసు కోవాలని మునిసిపల్ కార్యాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వినయ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది కోరారు.ఈ మేరకు సోమవారం పార్వ తీపురంలోని కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు.
పార్వతీపురం/టౌన్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):కమిషనర్‌పై చర్యలు తీసు కోవాలని మునిసిపల్ కార్యాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వినయ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది కోరారు.ఈ మేరకు సోమవారం పార్వ తీపురంలోని కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మునిసిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తమపై తీవ్రమైన పదజాలం వాడడమే కాకుండా, మనోభా వాలు దెబ్బతీసే విధంగా దుర్భాషలా డుతున్నారని పేర్కొన్నారు.మహిళా సిబ్బందిపై కమిషనర్ వ్యవహరశైలి విమర్శలకు తావిస్తోందన్నారు. ఆయా విభాగాల అధికారులు, ఉద్యోగులను, కిందస్థాయి సిబ్బంది వద్ద అవ మానపరచడంతో పలుసార్లు కన్నీళ్లు తెప్పిస్తోందని తెలిపారు. కమిషనర్ వ్యవహరశైలి నచ్చక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
పిల్లలు చూడడం లేదు.. పింఛన్ మంజూరు చేయండి
పార్వతీపురం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తమ పిల్లలు ప్రయోజకులుగా ఉన్నప్పటికీ తమను చూడడంలేదని, కనీసం ప్రభుత్వమైనా పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని భార్యాభర్తలు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌కు పలు సమస్య లపై వినతులు వెల్లువెత్తాయి.ఫజిల్లాలోని కోటవానివలసకు చెందిన ఎం.సన్యాసిరావు,పార్వతీ దంపతులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పింఛన్ మంజూరుచేయాలని కోరారు. తన భర్త సన్యాసిరావు గతంలో పడిపోవడం వల్ల ఏ పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారని అధికారులకు విన్నవించింది. ఫ తాను పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్నానని, ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానని తనకు రూ.ఆరువేలు పింఛను అందజేస్తున్నారని, కాని పింఛను రూ.15వేలు పెంచాలని దివ్యాంగుడు పి.శేషగిరిరావు వినతి పత్రం సమర్పించాడు.ఫ సీతానగరం మండలంలోని వెంకటాపురానికి చెందిన బుడితి వెంకటరమణ తమ పిల్లలకు రావాల్సిన తల్లికి వందనం మంజూరు కాలేదని మంజూరుచేయాలన్నారు.ఫ తనకు కిడ్నీ తొలగించా రని, మంచానికే పరిమితం అయిపోయానని, పింఛన్ మంజూరు చేయాలని కొమరాడ మండలం విక్రంపురానికి చెందిన యలమంచిలి పోలమ్మ కలెక్టర్‌కు వినతిపత్రం అందించింది.