తప్పుల్లేకుండా స్వామిత్ర సర్వే చేపట్టాలి: డీడీవో
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:26 AM
తప్పుల్లేకుండా స్వామిత్ర సర్వే చేప ట్టాలని డీడీవో ఎం.కిరణ్‌కుమార్ కోరారు.మండలంలోని కలవరాయిలో స్వామిత్ర సర్వే ప్రక్రియను పరిశీలించారు.
బొబ్బిలి రూరల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తప్పుల్లేకుండా స్వామిత్ర సర్వే చేప ట్టాలని డీడీవో ఎం.కిరణ్‌కుమార్ కోరారు.మండలంలోని కలవరాయిలో స్వామిత్ర సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసర్వే తరహాలో గ్రామ కంఠాలు, ఇతర స్థలాల్లో నిర్మాణాలు, పశువుల శాలలను డ్రోన్ల సాయంతో స్వామిత్ర సర్వే చేసి గుర్తించి హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పి.రవికుమార్,కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసెస్టెంట్లు పాల్గొన్నారు. అనంతరం కలవరాయిలో చెత్తనుంచి సంపదకేంద్రాన్ని డీడీవో తనిఖీచేశారు. చెత్త సేక రణ, వేరు చేసే పద్ధతి, వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకుబ న్నారు. ఆయన వెంట ఎంపీడీవో రవికుమార్ ఉన్నారు.
సురక్షిత తాగునీరందించాలి
ప్రజలకు సురక్షిత తాగు నీరందించాలని డీడీవో కిరణ్‌కుమార్ కోరారు.గురువారం జగన్నాఽథపురంలో తాగునీటి వాటర్ ట్యాంకులో క్లోరినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ 15 రోజులకొకసారి వాటర్ ట్యాంకులు శుభ్రపరి చి క్లోరినేషన్ చేయించాలని అధికారులకు ఆదేశించారు.