తప్పులు లేకుండా స్వామిత్ర సర్వే చేయాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:59 PM
: స్వామిత్రసర్వేను తప్పులు లేకండా ప్రతిఇంటికి వెళ్లి నిర్వహించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బుధవారం మం డలంలోని కలవరాయిలో గ్రామసచివాలయంలో ఇప్పటివరకూ సిబ్బంది చేసిన సర్వేను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాలను గుర్తిం చాలన్నారు.గ్రామకంఠాలు, ఇతరస్థలాల్లో నిర్మాణాలు, పశువులశాలలు డ్రోన్ల సాయం తో స్వామిత్ర సర్వే చేసి గుర్తించి, వారికి హక్కు పత్రాలు మంజూరు చేస్తే ఆస్తుల విక్రయాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని తెలిపారు.
బొబ్బిలి రూరల్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): స్వామిత్రసర్వేను తప్పులు లేకండా ప్రతిఇంటికి వెళ్లి నిర్వహించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బుధవారం మం డలంలోని కలవరాయిలో గ్రామసచివాలయంలో ఇప్పటివరకూ సిబ్బంది చేసిన సర్వేను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాలను గుర్తిం చాలన్నారు.గ్రామకంఠాలు, ఇతరస్థలాల్లో నిర్మాణాలు, పశువులశాలలు డ్రోన్ల సాయం తో స్వామిత్ర సర్వే చేసి గుర్తించి, వారికి హక్కు పత్రాలు మంజూరు చేస్తే ఆస్తుల విక్రయాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని తెలిపారు. సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎం పీడీవో అల్లు భాస్కరరావు, ఎంసీవో సుధాకర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తాగు నీటి ట్యాంకులు శుభ్రం చేయాలి
గ్రామాల్లో క్లోరినేషన్ చేసిన తాగునీటిని సరఫరా చేయాలని, తాగునీటి ట్యాం కులు శుభ్రం చేయాలని ఎంపీడీవో రవికుమార్ కోరారు. బుధవారం కృష్ణాపురంలో రక్షిత మంచినీటి వాటర్ ట్యాంకును పరిశీలించారు.ట్యాంకు క్లీనింగ్‌చేసిన వివరాలను నోటీసు బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు.