మలేరియా మాత్రలు మింగి..
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:06 AM
మలేరియా మాత్రలు మింగి ఓ గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంది.
మహిళ ఆత్మహత్య
కురుపాం రూరల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మలేరియా మాత్రలు మింగి ఓ గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏగులవాడ పంచాయతీ ఈతమానుగూడలో గురువారం రాత్రి జరిగింది. కురుపాం ఎస్‌ఐ నారాయణరావు అందించిన వివరాల ప్రకారం.. ఈతమానుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ మండంగి సూరమ్మ(30), సురేష్ భార్యాభర్తలు. సురేష్ మద్యానికి బానిస కావడంతో భార్య సూరమ్మ తాగవద్దని మందలిం చింది. ఈ విషయంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన సూరమ్మ ఇంటిలో ఉన్న 8 మలేరియా మాత్రలు మింగింది. దాంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరింది. సూరమ్మను మొండెంఖల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూరమ్మ మృతి చెందింది. సూరమ్మకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కురుపాం పోలీసులు కేసు నమోదు చేశారు.