Natural Farming ప్రకృతి సాగుతో నిరంతర ఆదాయం
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:25 AM
Sustainable Income Through Natural Farming ప్రకృతి వ్యవసాయంతో రైతులు నిరంతర ఆదాయం పొందొచ్చని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం బందలుప్పి గ్రామంలో ఓ రైతు పొలాన్ని సందర్శించి.. అక్కడ సాగుచేస్తున్న వివిధ రకాల పంటల వివరాలను అడిగి తెలుసు కున్నారు.
పార్వతీపురం రూరల్, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతో రైతులు నిరంతర ఆదాయం పొందొచ్చని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం బందలుప్పి గ్రామంలో ఓ రైతు పొలాన్ని సందర్శించి.. అక్కడ సాగుచేస్తున్న వివిధ రకాల పంటల వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఏటీఎం, ఏ గ్రేడ్ మోడల్స్‌ను పరిశీలించారు. ఏటీఎం మోడల్‌లో దొండ, రిలే సోయింగ్ పద్ధతిలో చిక్కుడు, వరుసల మధ్యలో మిరప, బంతి, ఆకుకూరలు వంటి వాటి సాగు చేస్తూ.. ఇప్పటివరకు రూ.80 వేలు ఆదాయం పొందినట్లు మురళీ అనే రైతు కలెక్టర్‌కు వివరించారు. పొలం గట్లపై సాగు చేసిన పంటల ద్వారా రూ.20 వేలు అదనపు ఆదాయం వచ్చిందని, ప్రకృతి సాగు ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ.. ప్రతి రైతు ఇటువంటి మోడల్స్‌ను అనుసరించాలన్నారు. బహుళ పంటల విధానం ద్వారా ఏడాది పొడువునా ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. 365 రోజులూ సాగు చేపట్టడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. ఈ పరిశీలనలో డీఏవో అన్నపూర్ణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి సత్యనారాయణరెడ్డి, ఏడీఏ వెంకటేష్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రబంధకులు ఎం.శ్రావణ్‌కుమార్ నాయుడు తదితరులున్నారు.