Share News

Suspension ప్లాస్టిక్‌ వస్తువులు కనిపిస్తే సస్పెన్షన్‌

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:42 PM

Suspension If Plastic Items Are Found గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా వినియో గించిన ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథిన్‌ కవర్లు కనిపిస్తే సంబంధిత సిబ్బందిని సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. వారం రోజుల్లో పరిస్థితి మారాలన్నారు.

Suspension  ప్లాస్టిక్‌ వస్తువులు కనిపిస్తే సస్పెన్షన్‌
అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌

  • కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, నవంబరు17(ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా వినియో గించిన ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథిన్‌ కవర్లు కనిపిస్తే సంబంధిత సిబ్బందిని సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. వారం రోజుల్లో పరిస్థితి మారాలన్నారు. ఆ తర్వాత విస్తృతంగా తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మండల, నియోజ కవర్గ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. బహిరంగ మలవిసర్జన జరగకుండా చూడాలని, రోడ్లపై ఎవరూ చెత్త వేయకుండా చూడాలని సూచించారు. అవసరమైన సీసీ రోడ్లు వేయాలన్నారు. షాపుల వద్ద ప్లాస్టిక్‌ బాటిల్స్‌ పడేస్తే దుకాణదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి మండలంలో రెండు గ్రామాలకు ఐఎస్‌వో సర్టిఫికెట్స్‌ రావాలంటే కార్యాలయాలు పరిశు భ్రంగా ఉండాలన్నారు. పాఠశాలలు, కాలేజీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. వచ్చేవారం నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, పరిసరాలు పరిశుభ్రంగా లేని పక్షంలో చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ సప్నిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:42 PM