Share News

Surveys for Disease Detection వ్యాధుల గుర్తింపునకు సర్వేలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:01 AM

Surveys for Disease Detection క్షేత్రస్థాయిలోనే వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు పక్కాగా ఆరోగ్య సర్వేలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక ఎన్‌జీవో హోంలో నిర్వహించిన ఎన్‌సీడీ 4.0 శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు.

Surveys for Disease Detection వ్యాధుల గుర్తింపునకు సర్వేలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో భాస్కరరావు

పార్వతీపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలోనే వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు పక్కాగా ఆరోగ్య సర్వేలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక ఎన్‌జీవో హోంలో నిర్వహించిన ఎన్‌సీడీ 4.0 శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. వ్యాధి ప్రబలకముందే అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి తగు చికిత్స అందించాలన్నారు. త్వరలో చేపట్టబోయే ఎన్‌సీడీ 4.0 సర్వేలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్‌ లక్షణాలున్నవారిని సకాలంలో గుర్తించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. అసంక్రమిత వ్యాధులను గుర్తించడంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లక్ష్యాలను చేరాలన్నారు. శిక్షణలో తెలియజేసిన అంశాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు వ్యాధులపై అవగాహన పెంపొందించే విధంగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సూర్యకౌశిక్‌, రమ్య, డీపీవో లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 12:01 AM