Share News

సర్వేయర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:43 PM

వంబరెల్లి గ్రామానికి చెందిన సవర బలరాం(31) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు.

సర్వేయర్‌ ఆత్మహత్య

సీతంపేట రూరల్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వంబరెల్లి గ్రామానికి చెందిన సవర బలరాం(31) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐ అమ్మనరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వంబరెల్లి గ్రామానికి చెందిన సవర బలరాం భామిని మండలంలోని బత్తిలి సచివాలయం-1లో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న బలరాం గ్రామ సమీపంలోని జీడితోటలో చెట్టు కు ఉరి వేసుకుని మృతి చెందారన్నారు. మృతుడికి భార్య దేవి, నీష, చారుమతి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బలరాం బలవన్మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమ పిల్లలకు దిక్కెవరని భార్య దేవి గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 02 , 2025 | 11:43 PM