Healthcare Services వైద్య సేవలపై ఆరా
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:04 AM
Survey on Healthcare Services వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కామన్ రివ్యూ మిషన్ ( సీఆర్‌ఎం) బృంద సభ్యులు సందర్శించారు. పీహెచ్‌సీ భవనం, సమాచార పట్టికలు, నీటి సరఫరా, పారిశుధ్యం తదితర వాటిని పరిశీలించారు. అనం తరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
వీరఘట్టం/కురుపాం/భామిని/పాలకొండ, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కామన్ రివ్యూ మిషన్ ( సీఆర్‌ఎం) బృంద సభ్యులు సందర్శించారు. పీహెచ్‌సీ భవనం, సమాచార పట్టికలు, నీటి సరఫరా, పారిశుధ్యం తదితర వాటిని పరిశీలించారు. అనం తరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆ తర్వాత వారు కురుపాం సీహెచ్‌సీ, భామిని మండలంలో బత్తిలి పీహెచ్‌సీ, పాలకొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమీక్షించి ఆరోగ్య కార్యక్రమాల అమలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. బత్తిలిలో టీబీ బాధితులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. గ్రామీణ ప్రజలతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. ఈ పరిశీలనలో సీఆర్‌ఎం బృంద సభ్యులు భవానీ సింగ్, అంకుర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.