డ్రోన్లతో సారా తయారీపై నిఘా
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:28 AM
:డ్రోన్లను ఉపయోగించి సారా తయారీ క్రేందాల సమాచారాన్ని సేకరించి, పటిష్ట నిఘా ఉంచాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు. నవోదయం 2.0 కింద సారా రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

పార్వతీపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి):డ్రోన్లను ఉపయోగించి సారా తయారీ క్రేందాల సమాచారాన్ని సేకరించి, పటిష్ట నిఘా ఉంచాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు. నవోదయం 2.0 కింద సారా రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నవోదయం 2.0 కార్య క్రమంపై జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. నవోదయం 2.0 ప్రచార రథం ప్రారంభించారు. కరపత్రాలు, గోడపత్రికలను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 137 గ్రా మాలను ఏబీసీ గ్రామాలుగా వర్గీకరించి దత్తత అధికారులను నియమించినట్లు తెలిపారు. సారా సంబంధిత ఫిర్యాదులకోసం టోల్ ఫ్రీ నెంబర్ 14405పై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. 1265 మంది పాత నేర చరిత్ర గల వ్యక్తులను గురించి వారిలో 191 మందిని బైండోవర్ చేసిన విషయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తొలుత కలెక్టరేట్ ప్రాం గణంలో 2.0 ప్రచార వాహనానికి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ, ఏఎస్‌పీ అంకిత సు రాన, అసిస్టెంట్‌కమిషనర్ రామచంద్రరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు, డీఈవో ఎన్.తిరుపతినాయుడు పాల్గొన్నారు.
మొల్ల రచనలు ఆదర్శం
కవియిత్రి మెల్లమాంబ రచనలు అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పార్వతీపురంలో మెల్ల జయంతి వేడుకలు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి పూలమాలలను వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హే మలత, ధర్మచంద్రారెడి పాల్గొన్నారు.
అందరికీ వివేకానంద ఆదర్శం
పార్వతీపురంటౌన్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడని మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం పార్వతీపురం జిల్లా పరిషత్ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో వివేకానందుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో హెచ్‌ఎం హేమసుందరరావు, తిరుమలాచార్యులు, కోటే శ్వరరావు, శ్రీనివాసరావు, గోవిందరావు, డీఈవో తిరుపతిరావు, ఇం డియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీరాములు పాల్గొన్నారు.
దృష్టి లోపాలను సరిచేసుకోవాలి
ప్రతి ఒక్కరూ దృష్టి లోపాల పరీక్షలను నిర్వహించుకొని, సరిచేసు కోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. పార్వతీపురంలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ, వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మందికిపైగా పరీక్షలు చేయగా 80 మందికి కంటిలో శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు.