Jamjavati జంఝావతి నిర్మాణానికి సహకరించండి
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:08 PM
Support the Construction of Jamjavati మన్యం జిల్లా వాసులు, రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం తరపున సహకారం అందించాలని ఎమ్మెల్యే విజయంద్ర ఒడిశా సిఎంను కోరారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న లోక్‌సభ, వివిధ రాష్ర్టా శాసనసభ ఎస్టీ, ఎస్టీ సంక్షేమ కమిటీ ప్రతినిధుల జాతీయ సదస్సుకు ఏపీ తరపున ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఒడిశా సీఎం మోహన్‌చరణ మాఝీని కలిశారు.
పార్వతీపురం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా వాసులు, రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం తరపున సహకారం అందించాలని ఎమ్మెల్యే విజయంద్ర ఒడిశా సిఎంను కోరారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న లోక్‌సభ, వివిధ రాష్ర్టా శాసనసభ ఎస్టీ, ఎస్టీ సంక్షేమ కమిటీ ప్రతినిధుల జాతీయ సదస్సుకు ఏపీ తరపున ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఒడిశా సీఎం మోహన్‌చరణ మాఝీని కలిశారు. మన్యం జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు గత ఐదు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై చొరవ చూపాలని కోరారు. ఇదిలా ఉండగా రెండు రోజుల జాతీయ సదస్సు ముగిసింది. అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సమష్టిగా కృషి చేద్దామని ఎస్టీ, ఎస్సీ సంక్షేమ కమిటీ ప్రతినిధులు తీర్మా నించారు. అనంతరం ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆహ్వానం మేరకు ఏపీ ప్రతినిధులు మధ్యాహ్న విందుకు హాజరయ్యారు.