హెచ్‌పీసీఎల్ పైపులైన్‌కు సహకరించండి
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:42 PM
: హెచ్‌పీసీఎల్ పైపులైన్ ఏర్పా టుకు రైతులు సహకరించాలని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ కోరారు.
లక్కవరపుకోట, జూలై 30(ఆంధ్రజ్యోతి): హెచ్‌పీసీఎల్ పైపులైన్ ఏర్పా టుకు రైతులు సహకరించాలని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ కోరారు. బుధవారం లక్కవరపుకోటలో తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు సమక్షంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా సాగర్ మాట్లాడుతూ గతంలో ఏర్పడిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైపులైన్‌కు సమాంతరంగా హెచ్‌పీసీఎల్ లైన్ వెళ్తోందని తెలిపారు. దీంతో రైతులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తాము అభివృద్ధికి ఆటకంకం కాదని, నష్టపరిహారం విషయంలో రాజీ పడేదిలేదని స్పష్టంచేశారు. విశాఖ నుంచి రాయపూర్ వెళ్తున్న హైవే రోడ్డుకు ఇచ్చినట్లు పరిహారం ఇవ్వాలని కోరారు. లేదంటే భూములిచ్చేది లేదని పేర్కొన్నారు. తామరాపల్లి, శ్రీరాం పురం, ఆర్జీపేట, రంగాపురం,రంగరాయపురం, ఖాసాపేట, కొట్యాడ, తలారి గ్రామాల మీదుగా పైపులైన్ వెళ్తున్నట్లు సుధాసాగర్ పేర్కొన్నారు. రైతులు పలు డిమాండ్లను డిప్యూటీ కలెక్టర్ ముందుఉంచారు. సమావేశంలో హెచ్‌పీసీఎల్ మేనేజర్ టి.లక్షణ్, సీఐటీయూ నాయకులు తరిని వెం కటరమణ పాల్గొన్నారు.