Share News

Farmer సాగుకు సాయం.. అన్నదాతల్లో ఆనందం

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:57 PM

Support for Irrigation Brings Joy to Farmer కూటమి ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ పఽథకం కింద నిధులు విడుదల చేయడంతో బ్యాంక్‌ల వద్ద రైతుల సందడి కనిపిస్తోంది. మంగళవారం సీతంపేటలో ఉన్న బ్యాంక్‌లు రద్దీగా దర్శనమిచ్చాయి.

 Farmer సాగుకు సాయం.. అన్నదాతల్లో ఆనందం
అన్నదాత సుఖీభవ నగదు కోసం సీతంపేటలోని బ్యాంక్‌ వద్ద రైతులు ఇలా..

సీతంపేట రూరల్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ పఽథకం కింద నిధులు విడుదల చేయడంతో బ్యాంక్‌ల వద్ద రైతుల సందడి కనిపిస్తోంది. మంగళవారం సీతంపేటలో ఉన్న బ్యాంక్‌లు రద్దీగా దర్శనమిచ్చాయి. తమ ఖాతాల్లో జమ అయిన నగదును విత్‌డ్రా చేసుకునేందుకు వివిఽధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. బ్యాంక్‌ల నుంచి నగదు తీసుకున్న అనంతరం ఆనందంతో ఇంటిదారి పట్టారు. నగదు లెక్కపెట్టుకుంటూ.. ఉత్సాహంగా కనిపించారు. వ్యవసాయ పెట్టుబడులకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు తెలిపారు.

మదుపులకు ఊతం

ఖరీఫ్‌ సాగుకు అవసరమయ్యే మదుపులకు ఊతం లభించింది. అన్నదాత సుఖీభవ పథకం ఆదుకుంది. గ్రామంలో సుమారు ఎకరన్నర వ్యవసాయ భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అందించిన రూ.5 వేలు నా బ్యాంకు ఖాతాలో జమైంది. పీఎం కిసాన్‌ నిధులు జమ కావాల్సి ఉంది. ఏదేమైనా ప్రభుత్వం అందించిన నగదు ఎరువులకు ఉపయోగపడుతుంది.

- అక్కేన స్వామినాయుడు, రైతు, సాంబన్నవలస, గరుగుబిల్లి మండలం

=======================

ఆనందంగా ఉంది..

సాగుకు ప్రభుత్వ సాయం అందింది. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద నా బ్యాంకు ఖాతాలో రూ.7 వేలు జమైంది. చాలా ఆనందంగా ఉంది. నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. మొక్కజొన్న, వరి, పత్తి పంటల పెట్టుబడులకు ఈ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటా.

- గంట భాస్కరరావు, కర్రివలస, పాచిపెంట మండలం

Updated Date - Aug 05 , 2025 | 11:57 PM