Share News

అన్నివిధాలుగా రైతులకు సహకరించండి

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:14 PM

వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోరారు. ఆదివారం తెట్టంగిలో పీఏసీఎస్‌ చైర్మననగా తిరుమలరాజు కిరణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు.

 అన్నివిధాలుగా రైతులకు సహకరించండి
మాట్లాడుతున్న కళావెంకటరావు :

గుర్ల, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి):వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోరారు. ఆదివారం తెట్టంగిలో పీఏసీఎస్‌ చైర్మననగా తిరుమలరాజు కిరణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా కళావెంకటరావు మాట్లాడుతూ సొసైటీని మరింత అభివృద్ధిచేసి రాష్ట్రంలోని ఉన్నతమైన స్థాయికి తీసుకు రావాలన్నారు. డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున మాట్లాడుతూ రైతుల కోసం టీడీపీ ఎళ్లవేళలా పనిచేస్తుందన్నారు.కార్యక్రమంలో బీజేపీజిల్లా అధ్యక్షుడు రాజేష్‌ వర్మ, టీడీపీ నాయకులు కేటీఆర్‌, వెన్ని సన్యాసినాయుడు, సీహెచ్‌ మహేశ్వరరా వు, సన్యాసినాయుడు, కామునాయుడు, పైల బలరాము, తాడ్డి చంద్రశేఖర్‌, సంచాన సన్యాసినాయుడు, పిల్లా అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:14 PM