Share News

Urea 12,944 టన్నుల యూరియా సరఫరా

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:57 PM

Supply of 12,944 Tonnes of Urea జిల్లాకు ఇప్పటివరకు 12,944 టన్నుల యూరియా సరఫరా అయిందని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరుకు దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశామన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

 Urea   12,944 టన్నుల  యూరియా సరఫరా
జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూలై 30(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ఇప్పటివరకు 12,944 టన్నుల యూరియా సరఫరా అయిందని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరుకు దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశామన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతేడాది ఖరీఫ్‌ సమయంలో 9,465 టన్నుల యూరియాను వాడగా, ఈ సీజన్‌ ఇప్పటివరకు 9,954 టన్నులను వినియోగించినట్టు పేర్కొన్నారు. ప్రైవేట్‌ డీలర్ల వద్ద 625 టన్నులు, సొసైటీలు, రైతు సేవా కేంద్రాల వద్ద 1440 టన్నులు, మార్క్‌ఫెడ్‌ వద్ద 120 టన్నుల బఫర్‌ యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూడా జిల్లా అవసరమైన యూరియా రానుందని, ముందస్తుగా ఎక్కవ బస్తాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. డీఏపీ, పొటాష్‌, సూపర్‌పాస్పేట్‌, కాంప్లెక్స్‌ ఎరువుల కొరత లేదన్నారు. ఇప్పటివరకు 245 రైతు సేవా కేంద్రాల ద్వారా 7,235 టన్నులు, 22 సొసైటీల ద్వారా 1,369 టన్నుల యూరియా, డీఏపీ ఎరువులును పంపిణీ చేశామన్నారు. ఎరువులకు సంంధించి సూచనలు, మార్గదర్శకాలు, ఇతర సమాచారం కోసం ఈ 79894 34766 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని సూచించారు.

ఎన్‌పీసీఐ చేయించుకోవాలి

అన్నదాత సుఖీభవ పథకం పొందడానికి రైతులు బ్యాంకుల వద్ద తప్పనిసరిగా ఎన్‌పీసీఐ చేయించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో దాదాపు 14 వందల మంది రైతులు వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. వారంతా సంబంధిత బ్యాంకు వద్దకు వెళ్లి ఎన్‌పీసీఐ చేయించుకోవాలన్నారు.

జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ పరిశీలన

పార్వతీపురంలో ఉన్న జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పరిశీలించారు. ప్రాసెసింగ్‌ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాసెసింగ్‌ను మంచి నాణ్యతతో చేపట్టాలని అక్కడున్న సిబ్బందికి సూచించారు. నాణ్యతా ప్రమాణాలు బాగుంటే మార్కెట్‌లో ఒక బ్రాండ్‌ క్రియేట్‌ అవుతుందన్నారు. తద్వారా మార్కెటింగ్‌కు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ పరిశీలనలో డీఆర్వో కె.హేమలత తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:57 PM