Sunday Fun & Buzz సండే సందడి
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:55 PM
Sunday Fun & Buzz సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు ఆది వారం కిటకిటలాడాయి. ఆడలి, జగతిపల్లి వ్యూపాయింట్లు, మెట్టుగూడ,సున్నపుగెడ్డ జల పాతాలు, సీతంపేట ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్‌లకు సందర్శకులు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు.
సీతంపేట రూరల్, నవంబరు16(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు ఆది వారం కిటకిటలాడాయి. ఆడలి, జగతిపల్లి వ్యూపాయింట్లు, మెట్టుగూడ,సున్నపుగెడ్డ జల పాతాలు, సీతంపేట ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్‌లకు సందర్శకులు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. మహిళలు, చిన్నారులు, యువకులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. జలపాతాల వద్ద స్నానాలు చేసి సెల్ఫీలు దిగారు. ఎన్టీఆర్ పార్క్‌లో ఏర్పాటుచేసిన పలు సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. మొత్తంగా అంతటా సండే సందడి నెలకొంది. పర్యాటక ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు.