ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:53 AM
మండలంలోని పులిపుట్టి పంచాయతీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన లిమ్మక భీమయ్య (55) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.
సీతంపేట రూరల్, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పులిపుట్టి పంచాయతీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన లిమ్మక భీమయ్య (55) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. దీనిపై సీతంపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ మస్తాన్ అందించిన వివరాల మేరకు.. ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన లిమ్మక భీమయ్య కొంతకాలంగా ఆర్థిక ఇబ్బం దులతో భాదపడుతున్నాడు. ఆదివారం ఆవులను మేతకు తీసుకువెళ్లిన భీమయ్య పులిపుట్టి, సుందరయ్య గూడ గ్రామాల మధ్య జీడితోటలో ఉరి వేసుకున్నాడు. అయితే ఆవులను మేతకు తీసుకువెళ్లిన భర్త ఎంత సమయమైన ఇంటికి రాకపోవడంతో భార్య భాగ్యలక్ష్మి భీమయ్యను వెతుక్కుంటూ తోటలోకి వెళ్లిం ది. అక్కడ చెట్టుకు ఉరివేసుకున్న భర్తను చూసి కేకలు వేసింది. దీంతో సమీపంలో ఉన్న గ్రామస్థులు వచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడికి కుమారుడు రాము ఉన్నారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్‌ఐ మస్తాన్ కేసు నమోదు చేశారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.